నేటి కాలంలో చాలా మంది అజీర్తి, గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్ లాంటి ఆహారపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే వాము తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాము జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పిని తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.