భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్కు రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అక్కడ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పట్లలో పాల్గొనే అధికారుల జాబితాను తమకు అందించాలని కోరారు. అగ్ని మాపక శాఖ పాత్ర కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు.