‘మా ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఒక్క రూపాయి అభివృద్ది చేస్తే వంద రూపాయల ప్రచారం చేసుకుందన్నారు. మేము అలా కాదు వంద రూపాయల అభివృద్ది చేసినా ఒక్క రూపాయి ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నాం. మాకు ప్రచారాల మీద ధ్యాస లేదు ప్రజలకు మంచి చేయాలనే దానిపైనే ధ్యాస ఉందన్నారు.