ఐపీఎల్ 2025 మెగా వేలం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్‌ను గుజరాత్ టైటాన్స్ తమ కొత్త అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. పార్థివ్ 17 ఏళ్ల విశిష్ట కెరీర్‌తో, జట్టుకు అనుభవం, విజ్ఞాన సంపదను అందించాడని అహ్మదాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీ అధికారిక ప్రకటనలో తెలిపింది.