ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పాక్ క్రికెటర్ నసీమ్ షా ఔటయ్యాడు. 16 బంతుల్లో 14 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 46వ ఓవర్లో కుల్దీప్ వేసిన నాలుగో బంతికి నసీమ్ షా కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇప్పటివరకు ODIల్లో కోహ్లీ 157 క్యాచ్ లు పట్టాడు. కాగా, ప్రస్తుతం పాక్ స్కోర్ 47 ఓవర్లకి 222/8గా ఉంది.