తీగ నాటే ముందు దుక్కిలో ఎకరానికి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ కలిపి వేయాలి. తీగ నాటిన రెండు నెలల నుంచి ఎకరాకు 80 కిలోల నత్రజని వేప పిండి, యూరియా 1:1 నిష్పత్తిలో ఏడాది నాలుగు నుంచి ఆరు దఫాలుగా వేయాలని. అలాగే ఎకరాకు ఒక టన్ను చొప్పున జిప్సం వేస్తే మంచి ఫలితం ఉంటుంది. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్, ఎర్ర గరప నేలలు తమలపాకు సాగుకు అనుకూలంగా ఉంటాయి.