కాంగ్రెస్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈరోజుకి 10% కూడా పూర్తి చేయలేదని BRS నేత హరీశ్ విమర్శించారు. 2023 డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అర్హులైన రైతుల్లో సగానికి పైగా ఇంకా వేచి చూడాల్సిన దుస్థితి ఉందన్నారు. ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయలేదని చెప్పారు. మహిళలకు రూ. 2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదన్నారు.