TG: కాంగ్రెస్ గొట్టం గాళ్లకు భయపడేవాళ్లు ఎవరు లేరని మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో 4 గంటల సమావేశం జరిగింది. వీళ్లకి లోల్లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి. ఇంకా పొంగులేటి ఐటీసీ కోహినూర్లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు. ఇలా ఒక్కొక్కటిగా వాళ్ల బాగోతాలు బయటపెట్టే బాధ్యత మా పార్టీది' అని కేటీఆర్ అన్నారు.