థియేటర్ల ముందు యూట్యూబ్ ఛానళ్లు, కొందరు నెటిజన్లు సినిమాల గురించి రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమా ఫలితాలపై ప్రభావం పడుతోందని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దీంతో ఇలాంటి రివ్యూలను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. సినిమా సమీక్షల పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని TFAPA పేర్కొంది.