నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 28 వ డివిజన్ గాజులపేటలో బుధవారం అదనపు కలెక్టర్ అంకిత్ కులగణన సర్వేను సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేను పక్కాగా నిర్వహించాలని ఎక్కడా ఇబ్బందులు కలగకుండా, సర్వేను పక్కడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.