నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టారని, అదే పరిస్థితి కాంగ్రెస్కు కూడా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.