సిరికొండ మండలంలోని వర్జన్ తాండ గ్రామంలో బుధవారం నిజామాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం చే సైబర్ నేరాలు, మంత్రశక్తులు, గంజాయి మత్తు పదార్థాలు, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ ధరించడం వంటి వాటిపై అవగాహన కల్పించినట్లు సిరికొండ ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. పిల్లలపై గంజాయి మత్తు ప్రభావం పడకుండా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.