రొడ్డెక్కిన 7వ బెటాలియన్ పోలీసుల భార్యలు
రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం ఉండాలంటూ 7వ బెటాలియన్ పోలీసుల భార్యలు ధర్నాకు దిగారు. సిరిసిల్లతో పాటు డిచ్పల్లిలో పిల్లలతో కలిసి హైవేపై బైఠాయించారు. తమ భర్తల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ లో రైతులను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్ డిచ్పల్లి వద్ద వారిని చూసి కాన్వాయ్ ఆపారు. మహిళకు సంఘీభావం తెలిపి, ప్రభుత్వం వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.