రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విఆర్ఎ ల సమ్మె లో బాగంగా బోధన్ మండల పరిధిలో నిర్వహిస్తున్న దీక్షలు గురువారంతో 11 వ రోజుకు చేరుకున్నాయి 11 రోజు బోధన్ తాహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న దీక్ష శిబిరం ముందు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విఆర్ఎ ల నాయకులు సిద్ధ సతీష్ , బిమేష్, దర్శన్ ఉదయ్ , వినయ్ గంగాధర్ విఠల్ దత్తు తదితరులు మాట్లాడుతూ గత 22 నెలల క్రితం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా గురువారం బోధన్ బిజెపి నాయకులు దీక్ష శిబిరంను సందర్శించి సంఘీభావం తెలిపారు.