ఏడపల్లీ మండలం జైతాపూర్ గ్రామ రైతులు సోమవారం బోధన్ ఆర్డీవో పాలన అధికారి కి వినతి పత్రం ఇచ్చారు. అలీ సాగర్ గేట్లు ఎత్తి వేయడం ద్వారా తమ పంట పొలాలు సుమారు 300 ఏకరాలు నీట మునిగిందని తమకు న్యాయం చేయాలని కోరుతూ జైతాపూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కంటే సత్యనారాయణ, రైతు సాయి కృష్ణ తో పాటు పలువురు రైతులు వినతి పత్రం ఇచ్చారు.