కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఇక్కడి పుష్కరిణిలో పర్యాటకుల కోసం నూతన బోటింగ్ ను ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.