విఆర్ఎ ల సమ్మెకు పిడిఎస్ యు మద్దతు

565பார்த்தது
విఆర్ఎ ల సమ్మెకు పిడిఎస్ యు మద్దతు
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడి ఎస్ యు) ఆధ్వర్యంలో బోధన్ లో వి ఆర్ ఏ లు 13 రోజులుగా చేపడుతున్న సమ్మెకు శనివారం దీక్ష శిబిరం వద్దకు వెళ్ళిమద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ.. సిఎం కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారమే విఆర్ఎ లకు పేస్కెలు అమలు చేయాలనీ, అదేవిధంగా 55 సంవత్సరాలు పై బడిన వారికి విరమణ చేసి వారి ఇంట్లో వారసులకు కుటుంబ వారసత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలనీ, అర్హులైన విఆర్ఎ లందరికి పై పదోన్నతులు ఇవ్వాలని, వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు బోధన్ డివిజన్ నాయకులు భాస్కర్, రాము, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி