ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జా దారుని పై అధికారులకు పిర్యాదు చేస్తే అధికారులే కబ్జా దారుని వెనకేసుకు వస్తున్నారని సమాచార హక్కు చట్టం అవగాహన &రక్షణ కమిటీ రాష్ట్రఅధ్యక్షులు పాతూరి యాదగిరి గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆయన బోధన్ లో మీడియా తో మాట్లాడారు. బోధన్ నియోజకవర్గం లోని ఏడపల్లి మండలం టా నకలన్ గ్రామ శివారులో గల సర్వే నంబర్ 164/3ఐ లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అధికారులకు పిర్యాదు చేస్తే మండల తహశీల్దార్ కబ్జాదారుని కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అయన వివరించారు.. ఉన్నతఅధికారులు కబ్జా కు గురైన భూమి పై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కబ్జా దారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా తాహసిల్ దార్ పై విచారణ జరిపి శాక పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నత అధికారులను విజ్ఞప్తి చేశారు.