బోధన్ కు చెందిన సూరజ్ ప్రకాష్, మరియు మండలం లోని కల్డుర్కీగ్రామానికి చెందిన డి. జలెందర్, అనారోగ్యం తో నిమ్స్ ఆసుపత్రి నందు వైద్యం చేయించుటకు ఎల్ ఓ సి అవసరము ఉండడం తో తేది 18. 8. 2022 నాడు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కి విన్నావించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి మన ముఖ్యమంత్రికి ప్రతి పాదనలు పంపారు దానికి గాను కలదుర్కి జలెందర్ కు 2, 50000/-, సూరజ్ ప్రకాష్, శక్కర్ నగర్ కి 1, 50, 000 ఎల్ ఓ సి అందజేశారు. ఇద్దరు పేషేంట్ లు మరియు వారి కుటుంబసభ్యులు బోధన్ ఎమ్మెల్యే కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సూచన మేరకు కల్దుర్కి కి చెందిన టిఅర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి, రెండు ఎల్ఓసిలను నిమ్స్ హస్పిటల్, హైదరాబాద్ కి వెళ్లి వారికీ అందించారు.