యుద్ధం అనేది ప్రపంచ మానవాళికి పెనుప్రమాదం అని, వ్యాపార కాంక్షతో సామ్రాజ్య వాదులు చేస్తున్న యుద్ధాన్ని ఖండించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రెటరియట్ సభ్యులు ఉప్పల ప్రభాకర్ అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు నిరసనగా ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్ లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. సమావేశంలో బి.దేవరాం, ముత్తెన్న, సురేష్, బాబన్న, నర్సయ్య, కిషన్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.