నిజామాబాద్: డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకులు పార్టీ చేసుకోవడానికి రూ. 4వేల విలువైన మద్యాన్ని బుధవారం కొనుగోలు చేశారు. పార్టీ చేసుకుందామని బీరు బాటిల్ ఓపెన్ చేయబోతే చనిపోయిన కప్ప అవశేషాలు కనిపించాయి. వెంటనే తమకు మందు అమ్మిన వైన్ షాపునకు వెళ్లారు. బీరు బాటిల్లో ఏదో ఉందని చూపిస్తే సదరు వైన్ షాపు యజమాని తమకేమీ సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.