దిలావర్పూర్: లేఅవుట్ ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతులు

58பார்த்தது
దిలావర్పూర్: లేఅవుట్ ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతులు
దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం లే అవుట్లను ఎంపీఓ గోవర్ధన్ పరిశీలించారు. లేఅవుట్ లేకుండా అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీఓ హెచ్చరించారు. లేఅవుట్ ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఉంటాయని ఆయన తెలిపారు. అక్రమ లేఔట్ లపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ చంద్రశేఖర్, నాయకుల రవి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி