భైంసా: తల్లిదండ్రులకు విద్యార్థుల అప్పగించిన పోలీసులు
బైంసా పట్టణంలోని ఎస్సీ వసతి గృహం నుంచి మంగళవారం ఉదయం విద్యార్థులు రాకేష్, చరణ్, ఈశ్వర్, కేశవ్ వెళ్లిపోవడంతో వార్డెన్ ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు కుబీర్ మండలం పల్సి తండాలో ఉన్నట్లు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. జిల్లా ఎస్సీ వసతి గృహ అధికారి రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులని అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు.