పంటల సాగులో అధిక యూరియా వాడితే అనర్థమే అని డీఏవో అంజిప్రసాద్ అన్నారు. కుంటాల మండలం వెంకూర్ శివారు ప్రాంతంలోని కౌలు రైతు గాజుల గోపి వ్యవసాయ క్షేత్రంలో రబీ సీజన్లో మొక్కజొన్న సాగులో యూరియా వాడకంపై శనివారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో మాట్లాడారు. రైతులు అధునాతన పద్ధతిలో, ఆదర్శ రైతుల అనుభవాలతో సాగు చేయాలని కోరారు. అధిక యూరియా వాడితే భూమిలో పోషక విలువలు తగ్గిపోయి దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు.