భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నలుగురు విద్యార్థులు మంగళవారం అదృశ్యమయ్యారు. ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ నిర్లక్ష్యం వహించారంటూ వాపోతున్నారు. విద్యార్థుల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగినట్లు అక్కడి మరో విద్యార్థి పేర్కొన్నారు. ఘటనా స్థలానికి పట్టణ సీఐ గోపీనాథ్ చేరుకొని వివరాలు సేకరించారు.