గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాసర గోదావరి నది ఒప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో మంగళవారం శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో గోదావరి నది ఘాట్ 1 వద్ద శాంతి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో విజయ రామారావు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ఆలయం ఆధ్వర్యంలో శాంతి పూజ నిర్వహించినట్లు తెలిపారు.