కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే మోసపోయినట్లేనని ముథోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్ అన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని రాటి, నంద, రావణ్ గావ్, మాతూల్ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీకి ఓటు వేయాలని కోరారు.