నిజామాబాద్, బైంసా ప్రధాన రోడ్డు మార్గం బాసర మీదగా వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సింగిల్ రోడ్డు ఉండడం, మరోవైపు రహదారి విస్తరణ పనులు జరగడంతో అటుగా వెళ్లే వాహనదారులు రాత్రిం బవళ్లు ప్రమాదానికి గురవుతున్నారు. వాహనదారుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక యువకుడు కారేగాం. సాయందర్ రావు స్వయంగా గో స్లో బోర్డును ఏర్పాటు చేయడంతో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.