ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ హాజరై కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.