ఖానాపూర్ పట్టణంలోని రింకొని వాగుపై వంతెన వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఖానాపూర్ తహశీల్దార్ శివరాజ్ దాడులు శనివారం నిర్వహించారు. అక్రమంగా మొరం తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.