కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటి విడుదల కొనసాగుతోందని సోమవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రాజెక్టులో 699. 92 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1, 131 క్యూసెక్కుల నీరు వస్తోందను దీంతో కుడి ఎడమ కాలువలకు 927, మిషన్ భగీరథకు 9, మొత్తం కలిపి 1, 023 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.