
నర్వ: ఘనంగా ఎద్దుల బండలాగుడు పోటీలు
నర్వ మండలంలోని రాంపూర్ గ్రామంలో మంగళవారం శ్రీశ్రీశ్రీ సద్గురు శరణు శంకరసిద్ధ లింగ మహారాజ్ జాతరలో ఎద్దుల బండలాగుడు పోటీలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఈ పోటీ కార్యక్రమానికి అంతరాష్ట్ర ఒంగోలు జాతి నాలుగు పల్ల బండలాగుడు పోటీలు ఉండంతో చుట్టుపక్కల గ్రామల రైతులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తారు.