
మక్తల్: ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
హైద్రాబాద్ లోని ప్రజా భవన్ లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సమావేశం ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెప్పారు. బీసీ రిజర్వేషన్లు, కులగణనపై విస్తృతంగా చర్చలు చేసినట్లు చెప్పారు. సమావేశంలో పాల్గొన్న నేతల నుండి సీఎం అభిప్రాయాలు సేకరించారని ఎమ్మెల్యే అన్నారు.