సూర్యాపేట: లంచాలు తీసుకోమని ఉద్యోగుల ప్రతిజ్ఞ
సూర్యాపేట ట్రాన్స్ కో కార్యాలయంలో విజిలెన్స్ విభాగం ఆద్వర్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. మేం లంచం తీసుకోం. నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తాం అని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట ఎస్ఈ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈ గాలి నాయుడు, విజిలెన్స్ సిఐ , డి. లింగయ్య, మహేందర్, దుర్గాప్రసాద్ ఉన్నారు.