రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు రాములు గౌడ్ మరణం అత్యంత బాధాకరమని అన్నారు.