గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి డా. బత్తుల రవి అన్నారు. మంగళవారం నాగారం మండలం లక్ష్మాపురం గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో 20 పశువులకు, గేదెలకు ఉచితంగా టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20 గేదెలకు 20 పశువులకు టీకాలు వేశారు.