సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కానిస్టేబుల్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ప్రభుత్వం డిస్మిస్ ని ఎత్తివేయాలన్నారు. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరారు.