ఎవరు అడ్డుపడిన మూసీ నది ప్రక్షాళన ఆగదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అయన నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు నడుం బిగించగా ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు పడుతున్నాయన్నారు.