రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ ఖరీఫ్ ధాన్యం సేకరణ చేస్తామని, రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు. సోమవారం చిట్యాల వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. సన్నధాన్యం వివరాలను, అలాగే ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.