పెరుగుతున్న దరలకు అనుగుణంగా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలని మిషన్ భగీరథ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు. శనివారం ఎఐటియుసి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నల్గొండ ఎస్సీ వెంకటేశ్వర్లుకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని అన్నారు.