మున్సిపల్ గ్రామ ప్రాంతాలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించారు. వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులు జాప్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు. 63 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.