దళితుల స్థితిగతులపై అధ్యయనం చేసి వెనుకబడిన కుటుంబాలకు న్యాయం చేయాలని ఎస్సి వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ జిల్లా ఛైర్మన్ లకుమాల మధుబాబు డిమాండ్ చేశారు. నల్లగొండలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో దళితుల వ్యతిరేక పోరాట సమితి జిల్లా వైస్ ఛైర్మన్ లు అడ్డంకి రవీందర్, చింతపల్లి బాలకృష్ణ, సంద యాదగిరి, నామ చక్రవర్తి, రాష్ట్ర నాయకులు లింగమయ్య, ఎన్నమల్ల అనిల్, లింగుస్వామి, తదితరులు పాల్గొన్నారు.