అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనానికి నల్గొండ జిల్లా చక్కని వేదిక ఆని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం నిమిత్తం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించబడిన 21 మంది ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో సమావేశం అయ్యారు.