ఆపద సమయంలో సీఎం సహాయనిధి నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 23 మందికి ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరైన రూ. 7, 18, 000 విలువ గల చెక్కులను నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు.