నల్గొండ నియోజకవర్గంలోని కాలువలకు ఎమ్మార్పీ నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎమ్మార్పీ కాలువల పరిధిలో ఉన్న రైతులకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని. నీరు విడుదల చేస్తే పంటలు పండించుకుంటారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.