కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తేమ శాతాన్ని ప్రతిరోజు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం ఆమె మునుగోడు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలను సరిగా నిర్వహించకుంటే కమిషన్ కట్ చేయడం జరుగుతుందని ఆమె కొనుగోలు కేంద్రం నిర్వాహకులను హెచ్చరించారు.