సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లతో కోరారు. సోమవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఎన్యుమరేటర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమగ్ర కుటుంబ సర్వే శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఆమె స్పష్టతనిస్తూ ఇది జనగణన, కుల గణన కాదని చెప్పారు.