యాదవ్ సంఘం భవనం కోసం తన నిధుల నుండి 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.