కట్టంగూర్ మండలం కలిమేర గ్రామంలో అంగన్వాడీ ఆయా కడారి ముత్తమ్మ ఆయాగా ఇరవై సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందారు. వారి భౌతికదేహానికి సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా వారు లేని లోటు తీరనిదని స్థానిక మండల Mro, ఐ సి డి యస్ వారి సహకారం తో ముత్తమ్మ కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని గుర్తు చేశారు. ఈ సందర్బంగా మండల కమిటీ సభ్యులు జాల రమేష్, ఇటుకల సురేందర్, గుడుగుంట్ల రామకృష్ణ శాఖ సభ్యులు అంజయ్య, పూదుటి నరహరి, గద్దపాటి ఎల్లయ్య, రాయల ఆనందం, ముస్కు రవీందర్ కుమారులు శంకర్, శ్రవణ్ తదితరులు నివాళులు అర్పించారు.