అనుముల మండలం హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ నాగార్జునసాగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్, కోరే రమేష్ మాట్లాడుతూ. కళాశాల ప్రారంభమై సుమారు 5 నెలలు గడుస్తున్న విద్యార్థులకు మాథ్స్ మరియు బోటనీ బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు.